అఫిషియల్ : ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

లైగర్ వంటి ప్లాప్ తో కొద్దిగా నిరాశ చెందిన కూడా ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే బౌన్స్ బ్యాక్ అయ్యి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు.

మరి రౌడీ స్టార్ విజయ్ నటిస్తున్న మూవీల్లో 'ఖుషి'( Khushi Movie ) ఒకటి.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/" / ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరి వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే వచ్చిన పాటలతో వీరి కెమిస్ట్రీ ఎంత అందంగా ఉందో చూపించడమే కాకుండా మరిన్ని అంచనాలు పెంచేసాయి.

"""/" / ఇక ఈ మధ్యనే షూట్ కంప్లీట్ కాగా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు.

ఈ సినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు కొద్దిసేపటి క్రితం గుడ్ న్యూస్ చెప్పారు.

ఆగస్టు 9న ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ పోస్టర్ లో సైతం ఈ జంట కెమిస్ట్రీ ఆకట్టు కుంటుంది.

మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

కాగా ట్రైలర్ తో ప్రమోషన్స్ మరింత జోరుగా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

ఈ లవ్ స్టోరీ విజయ్ కు సమంతకు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

గేమ్ ఛేంజర్ మూవీకి మరో టెన్షన్.. షారుఖ్ తో పోటీ పడితే అక్కడ కష్టమేనా?