Ileana : సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. వరుడు అతనే?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

 Star Heroine Ileana Secret Marriage With Michael Dolan-TeluguStop.com

ఆ తరువాత పోకిరి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఆపై వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా, కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.ఈ మధ్య తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.

Telugu Ileana, Michael Dolan, Ileana Secret, Tollywood, Trolls-Movie

దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.బేబి బంప్ వీడియో కూడా పోస్ట్ చేసింది.తాజాగా ఆమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని అందరితో పంచుకుని తన కొడుకు ఫొటోలను కూడా రివీల్ చేసింది.తాజాగా తన ప్రియుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇది ఇలా ఉంటే ఇంతవరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయం చెప్పలేదు.

Telugu Ileana, Michael Dolan, Ileana Secret, Tollywood, Trolls-Movie

అందరు ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిందని అనుకుంటున్నారు.ఈ క్రమంలో జూలై నెలలో తన ప్రియుడి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివరాలను మాత్రం వెల్లడించలేదు.అతనితో ఇలియానాకు ఈ సంవత్సరంలోనే పెళ్లి జరిగిందట.ఆమె భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలిపింది.గత సంవత్సరం నుండి వీరు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు.ఈ ఏడాది మే 13న సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారన్న వార్తలు వినిపించాయి.

అయితే తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించిన ఇలియానా పెళ్లిని ఎందుకు రహస్యంగా దాచిందో అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు.

Telugu Ileana, Michael Dolan, Ileana Secret, Tollywood, Trolls-Movie

తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించే ఒక నెల ముందుగా మ్యారేజ్ చేసుకుందని తెలుస్తోంది.తన భర్త గురించి పేరు తప్ప మరే ఇతర వివరాలను వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా భర్త వివరాలను మాత్రం సీక్రెట్‌గా ఉంచడం దేనికని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఏది ఏమైనా గోవా ముద్దుగుమ్మ తన కుమారునితో, భర్తతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube