మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.తన కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా చిరంజీవి తట్టుకోలేరు.
తన తమ్ముళ్లపై ఉండే అభిమానాన్ని చిరంజీవి చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు.వాల్తేరు వీరయ్య సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిరంజీవి భోళా శంకర్ తో ఆ సినిమాను మించిన సక్సెస్ ను అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.
నిన్న భోళా శంకర్( Bhola Shankar ) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా దర్శకుడు బాబీ( Director Bobby ) ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక అద్దె ఇంట్లో పవన్ మూవీ షూట్ జరుగుతోందని ఆ సమయంలో లైటింగ్ యూనిట్ కరెంట్ తో పని కాబట్టి ఆ ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగిందని ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడంతో ఇంటి ఓనర్ లైటింగ్ యూనిట్ తో గొడవ పడ్డాడని బాబీ చెప్పుకొచ్చారు.
ఈ విషయం తెలిసిన పవన్ ఇంటి ఓనర్ తో మాట్లాడుతూ డబ్బు తీసుకునే ఇంటిని అద్దెకు ఇచ్చారని ఇప్పుడు ఇలా మాట్లాడటం తప్పు అని చెప్పారని బాబీ కామెంట్లు చేశారు.ఆ ఇంటి ఓనర్ పవన్ పై కూడా అరవడంతో కోపంతో పవన్ అక్కడినుంచి వెళ్లిపోయారని బాబీ తెలిపారు.ఈ విషయం చిరంజీవికి తెలిసి ఎక్కడో ఉన్న చిరంజీవి వెంటనే ఇంటి ఓనర్ కు ఫోన్ చేశాడని బాబీ అన్నారు.
నా తమ్ముడిని తిట్టడానికి నువ్వు ఎవడివిరా అంటూ చిరంజీవి ఆ ఇంటి ఓనర్ ను పచ్చి బూతులు తిట్టేశారని బాబీ చెప్పుకొచ్చారు.తమ్ముడిపై చిరంజీవికి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.భోళా శంకర్ సినిమా విషయంలో చిరంజీవి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు.