ఇటీవల వివిధ సంఘాల నేతలతో వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకే తరహా వాగ్దానాన్ని ఇస్తున్నారు.జనసేన ప్రభుత్వం రాగానే మీ సమస్యలను తీరుస్తామని ప్రకటిస్తున్నారు .
అయితే వచ్చే ఎన్నికలలో పొత్తులలో భాగంగా 50 కన్నా తక్కువ సీట్లలోనే జనసేన పోటీ చేస్తుందని వార్తలు వస్తున్న దరిమిలా అసలు జనసేన ప్రభుత్వం( Jana Sena government) ఏర్పడే అవకాశం ఎక్కడుంది అన్నది ప్రధాన ప్రశ్నగా మారుతుంది.తీసుకున్న అన్ని సీట్లలో గెలిచినా కూడా అది మ్యాజిక్ ఫిగర్ గా చాలా దూరంగా ఉండటంతో అసలు జనసేన ప్రభుత్వం అన్న మాట ఎక్కడ ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న.

అయితే పవన్ ఉపయోగిస్తున్న మాటకు వేరే అర్థం ఉందని ఎన్డీఏలో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికలలో ఆ కూటమిలోకి తెలుగుదేశం కూడా చేరుతుందని.అలాంటప్పుడు ఈ కూటమి గెలిస్తే అది ఎన్డీఏ కూటమి విజయంగా పరిగణించబడుతుందని అప్పుడు ఎన్డీఏలో ( NDA )భాగస్వామిగా ఉన్న జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందన్నది పవన్ లెక్కగా తెలుస్తుంది .అప్పుడు ఆయా వర్గాలకు న్యాయం చేస్తామన్న ఉద్దేశంలోనే పవన్ మాట్లాడుతున్నట్టుగా సమాచారం.

ఒక మైనర్ భాగస్వామిగా ఉండటానికి పవన్ ఇష్టపడటం లేదని ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉండేందుకే మక్కువ చూపుతారని తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం కూడా ఈ షరతులు అంగీకరిస్తుందన్న అంచనాలలో జనసేన ఉన్నట్లుగా తెలుస్తుంది అందువల్లనే జనసేన ప్రభుత్వం అన్న మాటను ఆయన పదేపదే ఉపయోగిస్తున్నారని తద్వారా కార్యకర్తలలో ఉత్సాహాన్ని రేకెత్తించడంతోపాటు తటస్తులు సామాన్య ఓటర్లలో కూడా జనసేన వైపు పోలరైజ్ జరిగే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే జనసేన తెలుగుదేశం( Telugudesam ) పొత్తుకు ఆది లోనే ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది రెండు పార్టీలు పరస్పర చర్చలు లేకుండానే అభ్యర్థులను ప్రకటిస్తూ ఉండడంతో ఇది పొత్తు సమయంలో చాలా ఇబ్బందికర వాతావరణ ఏర్పడే అవకాశం ఉందని పొత్తు పలప్రధమయ్యే అవకాశాలు కూడా తక్కువ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి
.






