ఆ రీజన్ వల్లే కీర్తి సురేష్ పీక పట్టుకున్నాను.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ( Bhola Shankar ) రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఏరియాల్లో భోళా శంకర్ బుకింగ్స్ మొదలు కాగా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

 Megastar Chiranjeevi Shocking Comments About Keerthi Suresh Details Here Goes V-TeluguStop.com

చిరంజీవి భోళా శంకర్ రిజల్ట్ విషయంలో ఏ మాత్రం టెన్షన్ అవసరం లేదని చెప్పకనే చెబుతున్నారు.

భోళా శంకర్ సినిమా రివ్యూలు ఎలా ఉన్నా సినిమా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందడం గ్యారంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )కు సైతం రిలీజ్ రోజున నెగిటివ్ రివ్యూలు రాగా ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే.ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ కు ఊహించని స్థాయిలో లాభాలను అందించింది.

నైజాంలో మైత్రీ నిర్మాతలు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసుకోవడంతో వాళ్లకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి.

అయితే భోళా శంకర్ మూవీ సెట్స్ లో చిరంజీవి( Chiranjeevi ) కీర్తి సురేష్ పీక పట్టుకోవడం గతంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.అయితే కీర్తి( Keerthy Suresh ) పీక పట్టుకోవడం గురించి మెగాస్టార్ స్పందిస్తూ మా ఇంట్లో తమిళ వంట మనిషి ఉన్నాడని కీర్తికి కావాల్సిన భోజనం అతనే పంపేవాడని చెప్పారు.ప్రతిరోజూ కీర్తి చాలా వెరైటీలు తినేదని తినే మొత్తం తక్కువే అయినా ఎంజాయ్ చేసేదని ఒక్కోసారి ఏం కావాలో డిమాండ్ చేసేదని చిరు తెలిపారు.

ఉప్పు, కారం తగ్గితే ఫుడ్ ను కీర్తి సురేష్ వెనక్కు పంపేదని మళ్లీ సరిగ్గా చేయమని కోరేదని చిరంజీవి పేర్కొన్నారు.ఒకసారి షూట్ లో బిజీగా నన్ను కీర్తి సురేష్ రేపు మెనూ ఏంటి అని అడిగిందని నాకు ఒక్కసారిగా కోపమొచ్చి పీక పట్టుకున్నానని ఈ షాట్ ఆ సమయంలో తీసిన షాట్ అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube