కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు.ఇందులో భాగంగా జనసేనాని రైతులను కలిశారు.
గత ప్రభుత్వం పారిశ్రామిక వాడకు 1,460 ఎకరాలు ఇచ్చిందన్నారు.సహజ వనరులు ప్రజలందరి సొత్తన్న పవన్ కల్యాణ్ మల్లవల్లి రైతులకు పరిహారం ఇచ్చే వరకు అండగా ఉంటానని తెలిపారు.
ఈ క్రమంలో తీసుకున్న భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు.మల్లవల్లి రైతులు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నారని వెల్లడించారు.
కులాలు, పార్టీలు, ప్రాంతాల వారీగా రైతులను విడదీయలేమని చెప్పారు.రైతుల్లో ఐక్యత లేకుంటే ఇబ్బందులు పడుతారన్న పవన్ కొత్త ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.







