న్యూస్ రౌండప్ టాప్ - 20

1.ఆర్టీసీ అధికారులతో గవర్నర్ భేటీ

Telugu Chandrababu, Cm Kcr, Mlc Kavitha, Pawan Kalyan, Telangana, Telugu, Todays

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గవర్నర్ తమిళ సై సౌందర రాజన్( Governor Tamilisai ) రాజ్ భవన్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol-TeluguStop.com

2.చంద్రబాబు కామెంట్స్

వైసిపి ప్రభుత్వం కొనసాగిస్తున్న విధ్వంసం పై యుద్ధభేరి చేపట్టామని, సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు( TDP Chandrababu naidu ) విమర్శించారు.

3.అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క

Telugu Chandrababu, Cm Kcr, Mlc Kavitha, Pawan Kalyan, Telangana, Telugu, Todays

సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడాన్ని నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క( Congress MLA Seethakka ) అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేశారు.

4.కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు( Harish Rao ) మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్  ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

5.వృద్ధులు, గర్భిణీలు ఐదు రోజుల పాటు  బయటకు రావద్దు

తమిళనాడు( Tamilnadu )లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని, ఐదు రోజులపాటు ఎవరూ బయటకు రావద్దని తమిళనాడు వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు.

6.పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కావాలంటే సీఎం ఎన్ రంగస్వామి( N Rangaswamy ) అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సభ లో ఆమోదించారు.

7.నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

8.తిరుమల సమాచారం

Telugu Chandrababu, Cm Kcr, Mlc Kavitha, Pawan Kalyan, Telangana, Telugu, Todays

తిరుమల( Tirumala Tirupathi )లో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

9.కేటీఆర్ సవాల్

ఓఆర్ఆర్ టోల్ కుంభకోణం ను రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని మంత్రి కేటీఆర్ అన్నారు.

10.టిఆర్ఎస్ ప్రభుత్వం పై జీవన్ రెడ్డి విమర్శలు

తెలంగాణ ప్రభుత్వానికి మద్యం వ్యాపారం,  ప్రభుత్వ భూములు అమ్మకం ఈ రెండే ఆదాయ మార్గాలుగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) విమర్శించారు.

11.తెలంగాణ విధానాలే దేశంలో  అమలు : కవిత

Telugu Chandrababu, Cm Kcr, Mlc Kavitha, Pawan Kalyan, Telangana, Telugu, Todays

తెలంగాణ విధానాలు దేశంలో అమలవుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) అన్నారు .ఈ సందర్భంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై విమర్శలు చేశారు.

12.కెసిఆర్ కామెంట్స్

తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రజల గుండెల్లో చరస్మరణీయులుగా ఉంటారని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు.

13.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్

Telugu Chandrababu, Cm Kcr, Mlc Kavitha, Pawan Kalyan, Telangana, Telugu, Todays

టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల డి.ఎన్ ఏ ఒక్కటేనని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy 0 విమర్శించారు.

14.రాష్ట్రవ్యాప్తంగా చేనేత వారోత్సవాలు

జాతీయ చేనేత దినోత్సవం ను ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహిస్తోందని , ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు చేనేత వారోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) అన్నారు.

15.గిరిజనులను జగన్ మోసం చేస్తున్నారు

Telugu Chandrababu, Cm Kcr, Mlc Kavitha, Pawan Kalyan, Telangana, Telugu, Todays

గిరిజనులను ఏపీ సీఎం జగన్ మోసం చేశాడని, వారి సంక్షేమానికి సంబంధించి 16 పథకాలను రద్దు చేశాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh 0 విమర్శించారు.

16.రాష్ట్ర డేటా సెంటర్లో సమస్యలు

ఏపీ రాష్ట్ర డేటా సెంటర్ లో సమస్యలు తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయంలోని కొన్ని అప్లికేషన్లపై దాని ప్రభావం ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు.

17.వెటర్నరీ వర్సిటీకి తాత్కాలిక వీసీ గా ద్వివేది

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి తాత్కాలిక ఉపకులాధిపతిగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ని గవర్నర్ నియమించారు.

18.పట్టిసీమ నుంచి నీరు విడుదల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జిల్లాలను విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం 14 మీటర్ల పైబడి ఉండడంతో కృష్ణ డెల్టాకు నీటి అవసరం ఏర్పడడంతో పట్టిసీమ ద్వారా 2,832 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

19.తానా ఫౌండేషన్ చైర్మన్ గా శశికాంత్

Telugu Chandrababu, Cm Kcr, Mlc Kavitha, Pawan Kalyan, Telangana, Telugu, Todays

తానా ఫౌండేషన్ చైర్మన్గా వల్లేపల్లి శశికాంత్ ఎన్నికయ్యారు.ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ కాగా ప్రస్తుతం బోస్టన్ లో స్థిరపడ్డారు.

20.జగన్ పై అచ్చెన్న విమర్శలు

రాష్ట్రాన్ని వల్లకాడుగా మారుస్తున్నారని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube