తెలంగాణ అసెంబ్లీ సభా నిర్వహణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా మండిపడ్డారు.అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పారు.
సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పారు.
కానీ తనకు అవకాశం ఇవ్వకుండా ఉంటే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు.తాము ఒక్క నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా సభలో అధికార పార్టీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుందని విమర్శించారు.







