దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.27 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,470 కోట్లను ఖర్చు చేయనున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తెలంగాణలో 21 రైల్వేస్టేషన్లు, ఏపీలో 18 రైల్వేస్టేషన్లకు పునరుద్ధరణ పనులు జరగనున్నాయి.కాగా రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది.
అందుకు సంబంధించిన కొన్ని స్టేషన్ల నమూనాలను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే.







