మెగా మల్టీస్టారర్ తో మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రేక్షకుల ముందుకు గత వారం వచ్చారు.వీరిద్దరూ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ”బ్రో ది అవతార్”( Bro Movie ).
వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.సముద్రఖని( Samuthirakani ) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించగా ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసింది.కానీ మిక్స్డ్ టాక్ రావడంతో ఇది కాస్త ప్లాప్ అంటూ అందరి నోటా వినపడడంతో కలెక్షన్స్ అమాంతం తగ్గిపోయాయి.
అయితే మళ్ళీ అంబటి వివాదం ఈ సినిమాకు కలిసి వచ్చినట్టే అనిపిస్తుంది.అందుకే మళ్ళీ వీకెండ్ లో మళ్ళీ పుంజుకున్నట్టు తెలుస్తుంది.బ్రో సినిమా 9వ రోజు కలెక్షన్స్( Bro Movie Collections ) కాస్త పెరిగినట్టే అనిపిస్తుంది.9వ రోజు ఈ సినిమా 75 లక్షల షేర్ 1.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అయినప్పటికీ ఈ సినిమా ఇంకా 33 కోట్లకు పైగానే వసూళ్లు వస్తేనే హిట్ సినిమాగా నిలుస్తుంది.ఈ వీక్ లో సినిమాలు ఏమీ లేకపోవడంతో ఆదివారం కూడా కాస్త కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.ఇవి పవన్ రేంజ్( Pawan Kalyan ) వసూళ్లు కాకపోయినా ఏదో కొద్దిగా అయినా నష్టాల నుండి తప్పించే అవకాశం అయితే ఉంది.
మొత్తంగా క్లోజింగ్ అప్పటికి ఎంత రాబట్టి ఎంత మేర నష్టాలు వాటిల్లుతాయో చూడాలి.







