టాలీవుడ్ అక్కినేని హీరో అక్కినేని అఖిల్( Akkineni Akhil ) గురించి అందరికీ తెలిసిందే.అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న ఇప్పటికీ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.
ఎంత మంది డైరెక్టర్లు ట్రై చేసినప్పటికీ అఖిల్‌కి మాత్రం బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోతున్నారు.కథల ఎంపికలో పొరపాటు చేస్తున్నాడా లేకపోతే డైరెక్టర్స్ సరిగ్గా తీయలేక పోతున్నారా అన్నది తెలియడం లేదు కానీ అఖిల్ కు మాత్రం కెరియర్ లో చెప్పుకోదగ్గ సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు.
దీంతో చాలామంది నెటిజెన్స్ ఇకపై సినిమాలు మానేసి వేరే ఏదైనా చూసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.
అఖిల్ ఇటీవల నటించిన ఏజెంట్ సినిమా( Agent Movie ) భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం ఎంత కష్టపడినప్పటికీ అఖిల్ కుమార్ సరైన గుర్తింపు దక్కలేదు.ఈ సినిమాతో అఖిల్ క్రేజ్ మారిపోతుంది అని అభిమానులు భావించగా అందుకు విరుద్ధంగా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పాటు అఖిల్ ను మరింత పాతాళంలోకి నెట్టేసింది.
కాగా అఖిల్ కెరియర్( Akhil Career ) లో ఇంకొక ఫ్లాప్ సినిమా పడింది అంటే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పక తప్పదు.అఖిల్ కెరీర్‌లో ఎదైనా చెప్పుకోదగ్గ సినిమా ఉందంటే అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bachelor ) అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల( Director Srikanth Addala ) అఖిల్ కోసం ఒక మంచి కథ రెడీ చేసారట.ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పెద కాపు చిత్రంతో బిజీగా ఉన్నారు.కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తున్నాడు.అది పూర్తయిన వెంటనే అఖిల్‌తో మూవీ మొదలుపెట్టనున్నాడని సినీ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అఖిల్ కోసం ఒక పవర్ పుల్ కథ సిద్దం చేశాడట.
అది మాస్ యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది.దానికోసం అఖిల్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్టు నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి.
శ్రీకాంత్ ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలు చేయలేదు.తనదంతా ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ సినిమాలే మరి యాక్షన్ కథను తీయగలడా అని కొందరు సందేహ పడుతున్నారు.
ఎలగైన అఖిల్‌కు ఒక మంచి హిట్ సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇక ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) నిర్మిస్తున్నట్లు సమాచారం.
కథల విషయంలో దిల్ రాజుకు మంచి అనుభవం ఉంది.తనకు కథ నచ్చిందంటే సినిమా 50 శాతం హిట్ అయినట్టే.
మరి అఖిల్ ఈ సినిమాతో అయినా సక్సెస్ను అందుకుంటాడో లేదో చూడాలి మరి.ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే అఖిల్ సినిమా నాకు గుడ్ బై చెప్పక తప్పదు.