'ఉస్తాద్'లో కూడా గట్టిగానే ఇవ్వనున్న పవన్.. అంత జరిగిన తగ్గేదేలే అట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఇటీవలే కీ రోల్ పోషించిన ”బ్రో ది అవతార్”( Bro ) మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఒక వివాదం నడుస్తూనే ఉంది.

 Solid Political Satires In Pawan Kalyan's Ustaad Bhagat Singh, Ustaad Bhagat Sin-TeluguStop.com

ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) వివాదం బ్రో సినిమాకు పెద్ద తలనొప్పిగా మారింది.ఈ వ్యవహారంలో ఇంత రచ్చ జరిగిన మళ్ళీ పవన్ అడుగులు వైసీపీని టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి.

Telugu Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Ustaadbhagat-Movie

తన సినిమాల్లో పొలిటికల్ టచ్( Political Punches ) ఉండేలా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాడు.ఇక తన లైనప్ లో ఉన్న మరో సినిమాలో కూడా పొలిటికల్ సెటైరికల్ పంచెస్ బాగానే రాయించినట్టు తెలుస్తుంది.మరి ఆ సినిమా ఏంటంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్”( Ustaad Bhagat Singh ).ఈ సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.

ఎప్పుడో 11 ఏళ్ల క్రితం ఈ సినిమా వచ్చి సంచలనం సృష్టించింది.

ఎప్పుడో రెండేళ్ల క్రితమే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పేరు మార్చి మళ్ళీ ఈ ఏడాది స్టార్ట్ చేసారు.అయితే అలా స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకోగా వెంటనే మళ్ళీ వాయిదా పడింది.

కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే షూటింగ్ జరుపుకోగా ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.

ఇక అతి త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ను మేకర్స్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో హరీష్ శంకర్ కు చెప్పి మరీ పొలిటికల్ సెటైర్స్ ను పవన్ రాయించినట్టు ఒక వార్త వైరల్ అయ్యింది.

ఎలాగూ 2024లో ఎలెక్షన్స్( 2024 Elections ) ఉన్నాయి కాబట్టి ఈ పొలిటికల్ టచ్ కూడా ఉంటే మరింత మైలేజ్ ఇచ్చినట్టు ఉంటుంది.

Telugu Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Ustaadbhagat-Movie

అందుకే ఈ సినిమాను ముందుగానే పూర్తి చేసి ఎన్నికల ముందే రిలీజ్ చేయాలని పవన్ కూడా అనుకుంటున్నారట.ఈ క్రమంలోనే వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను పూర్తి చేసి 2024 పొంగల్ రేస్ లోకి పక్కాగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.ఇక ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube