కశ్మీర్లో( Kashmir ) శాంతి నెలకొల్పడమే ధ్యేయంగా మోదీ సర్కార్( PM Modi ) కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను( Article 370 ) రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఆర్టికల్ రద్దు అనంతరం, ఇక్కడ సో కాల్డ్ పీపుల్ ఎలాంటి ధర్నాలు చేసారో కూడా తెలిసిందే.
అయితే ఆర్టికల్ రద్దు తరువాత జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోవడం దేశం గమనించవచ్చు.ఈ నేపథ్యంలోనే కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది.
దీంతో, ఆమె కామెంట్స్.వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వివరాల్లోకి వెళితే, శ్రీనగర్లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్( Royal Enfield Bike ) నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది.దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.
కశ్మీర్ అబ్బాయిలకే కాదు.ఇక్కడ స్త్రీలలో ( Women ) కూడా ఎంతో మార్పు వచ్చింది.ఇపుడిపుడే స్వేశ్చను అనుభవిస్తున్నాం.370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు.భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు… అంటూ కామెంట్స్ చేసింది.
దాంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.మరోవైపు.ఈ వీడియోపై కశ్మీర్ సో కాల్డ్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అంటూ ఆమెపైన కేసులు పెట్టాలని ప్రశ్నించారు.దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించక తప్పలేదు.
ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు.కానీ ఆమె వీడియోని తిలకించిన నెటిజనం మాత్రం మోడీ సర్కారుని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇది కదా నిజమైన స్వతంత్రం అని, దానికి కారణం పూర్తిగా మోడీనే అని కీర్తిస్తున్నారు.