అదిరిపోయిన గూగుల్ ఫీచర్... పర్సనల్ డీటైల్స్ ఎక్కడున్నా పసిగట్టేస్తుంది!

టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ క్రమంలో ఇంటర్నెట్( Internet ) వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది.

 How To Remove Your Personal Info From Google Search Results,personal Details,res-TeluguStop.com

మనదేశంలో ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ వ్యాపించింది.ఈ ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

ఇక టెక్నాలజీ( Technology ) ఎంత అభివృద్ధి చెందుతుందో.మోసాలు కూడా అదే రీతిలో పుట్టుకొస్తున్నాయి.

కొంతమంది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాతో లెక్కలేనన్ని మోసాలకు పాల్పడుతూ అభంశుభం తెలియని జనాలను మోసం చేస్తున్నారు.ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Telugu Google, Personal, Result, Tech-Technology Telugu

అవును, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్న వారికి చెక్ పెట్టడానికి గూగుల్( Google ) ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది.ఈ ఫీచర్ ఇప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉండగా రానున్న రోజుల్లో ఇది మిగిలిన అన్ని దేశాల్లో విస్తరించనుంది.తాజా నివేదికల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌లో గూగుల్ ‘రిజల్ట్ అబౌట్ యూ'( Result About You ) లాంచ్ చేసింది.ఈ ఫీచర్ అనతి కాలంలోనే మొబైల్, వెబ్‌సైట్ వంటి వాటిలో ప్రత్యక్షమైంది.

ఆ ఫీచర్ ఇప్పుడు మరింత ఆధునికంగా మారినట్టు సమాచారం.ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎక్కడైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

Telugu Google, Personal, Result, Tech-Technology Telugu

ఆ తరువాత వాటిని తొలగించడానికి కూడా ఇది సహకరిస్తుంది.ఇప్పటి వరకు వినియోగదారులకు సంబంధించిన వివరాలను( Personal Details ) వెతుక్కోడానికి చాలా సమయం పట్టేది.కానీ త్వరలో రానున్న గూగుల్ కొత్త ఫీచర్ యూజర్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు కనిపించిన వెంటనే తొలగించుకోవడానికి సహకరిస్తుంది.ఈ గూగుల్ కొత్త ఫీచర్( Google New Feature ) వల్ల వ్యక్తిగత వివరాలు సులభంగా తొలగించవచ్చు, కానీ అవసరమైన చోట కూడా ఈ వివరాలు తొలగిపోతాయేమో అని కొంతమంది అనుమానించగా కొన్ని ఆప్షన్స్ ఎంచుకోవడం వల్ల అలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube