ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో అధికార పార్టీ మరియు విపక్షాలు ఎవరి వ్యూహాలతో వారు ప్రజల మన్నలు అందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు( Chandrababu ) పుంగనూరు పర్యటనలో చోటు చేసుకున్న సంఘటనలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.ఈ క్రమంలో వైసీపీ నేతలు వర్సెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు( Ayyannapatrudu ) తణుకు నియోజకవర్గంలో టీడీపీ నేతల సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా తనకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పై( Minister Karumuri Nageswara Rao ) అయ్యన్నపాత్రుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.శనివారం రాత్రి వేల్పూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ మంత్రి అసలేం చేస్తున్నారని ప్రశ్నించారు.పౌరసరఫరాల శాఖలో ఎన్ని విభాగాలు ఉంటాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
టిడిఆర్ బాండ్ లలో ఎందుకోట్ల కుంభకోణం జరిగిందని అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు.







