ఇంట్లోనే మట్టిలో కాకుండా నీటిలో పెంచే మొక్కలు ఇవే..!

ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి.ఆ అలవాట్లకు అనుగుణంగా జీవిస్తూ, చుట్టూ ఉండే పరిసరాలు కూడా తమ అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలని అనుకుంటారు.

 These Are The Plants That Can Be Grown In Water Instead Of Soil At Home..!, Wate-TeluguStop.com

అలా కొందరికి మొక్కలన్నా, మొక్కలను పెంచడం అన్న ఎంతో ఇష్టం ఉంటుంది.కానీ పరిస్థితుల కారణంగా మొక్కలను పెంచాలన్న ఆసక్తి ఉన్నా కూడా పెంచలేక పోతారు.

ముఖ్యంగా నగరాలలో అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉండడంతో మొక్కలను పెంచాలి అనుకునే వారు తమ ఇష్టాలను పక్కన పెట్టేస్తున్నారు.అలాంటివారు ఇంట్లోనే ఎటువంటి మట్టి అవసరం లేకుండా కేవలం నీటిలో పెరిగే మొక్కలను ఎంపిక చేసుకుని పెంచవచ్చు.నీటిలో పెరిగే మొక్కలు ఏవో తెలుసుకుందాం.

మనీ ప్లాంట్:

ఈ మొక్క మట్టిలో పెరుగ గలుగుతుంది.అలాగే నీటిలో కూడా పేరు గలుగుతుంది.ఒక గాజు సీసాలో నీరు పోసి అందులో ఒక మనీ ప్లాంట్( Money Plant ) మొక్కను ఉంచి పెంచవచ్చు.మొక్క తాజాగా కనిపించడానికి ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి.

అగ్లోనెమా:

ఈ మొక్క గులాబీ మరియు ఆకుపచ్చ రంగులో డబుల్ షెడ్ గా ఉండి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.ఇంటి అలంకరణ కోసం ఈ మొక్కను చాలామంది పెంచుకుంటారు.ఆరోగ్యవంతమైన మొక్క నుండి ఆరు అంగుళాలు కట్ చేసి, ఒక గాజు సీసాలో నీరు పోసి అందులో నాటితే చాలు.

Telugu Aglaonema, Agriculture, Fengshui, Latest Telugu, Lucky Bamboo, Philodendr

ఫిలోడెండ్రాన్:

ఈ మొక్కను ఇండోర్ ప్లాంట్( Philodendron ) గా పెంచుకోవచ్చు.ఈ మొక్క యొక్క ఆకులు గుండె ఆకారంలో ఉండి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.కాంతి అధికంగా ఉన్న, తక్కువగా ఉన్న సులభంగా రిఫ్రెష్ అవుతుంది.ఈ మొక్కను పెంచడానికి ఎక్కువగా శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు.

లక్కీ బేంబూ ట్రీ:

ఈ మొక్కను వెదురు మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క( Lucky Bamboo ) ఇంట్లో ఉంటే ఇంటికే అందం పెరుగుతుంది.

ఇంటి అలంకరణలో భాగంగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు.

Telugu Aglaonema, Agriculture, Fengshui, Latest Telugu, Lucky Bamboo, Philodendr

పైన చెప్పిన మొక్కలను మట్టి అవసరం లేకుండా ఒక గాజు సీసాలో నీరు పోసి, అందులో ఈ మొక్కలను పెంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube