జెడి చక్రవర్తి ( JD Chakravarthy ) తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
తాజాగా దయ ( Daya ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా చక్రవర్తి ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇక ఈ సిరీస్ లో ఈషా రెబ్బ( Esha Rebba ) తో పాటు యాంకర్ విష్ణు ప్రియ ( Vishnu Priya ) కూడా కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా విష్ణు ప్రియ జె.డి చక్రవర్తి గురించి కాస్త బోల్డ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

తనకు జె.డి చక్రవర్తి అంటే క్రష్ అని తను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను అంటూ ఈమె కామెంట్ చేశారు .అప్పటినుంచి వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా విష్ణు ప్రియ చక్రవర్తి పెళ్లి అన్న వార్తలపై ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వార్తలపై స్పందించారు.
ఈ సందర్భంగా జెడి చక్రవర్తి విష్ణు ప్రియతోనే కాదు తాను ఇప్పుడుపెళ్లికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.అయితే మీ ఇష్టం మీరు ఎవరితో అయినా నా పెళ్లి చేయండి అని చాలెంజ్ విసిరారు ఇక పెళ్లి చేయడానికి ఎక్కడ ఫంక్షన్ హాల్ దొరకకపోతే నా స్టూడియోలోనే చేయండి అంటూ సవాల్ విసిరారు.

ఈ విధంగా తన పెళ్లి గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందించినటువంటి జెడి చక్రవర్తి ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా విష్ణు ప్రియతో జెడి చక్రవర్తి పెళ్లి అంటూ వస్తున్నటువంటి వార్తలకు ఈయన ఇలా క్లారిటీ ఇచ్చారని అర్థమవుతుంది.ఇక జెడి చక్రవర్తి తెలుగులో ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి మెప్పించారు.అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించారు.ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జెడి వరుస సినిమాలలో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.







