సముద్రాల లోపల భయంకర వేడిగాలులు... యుగాంతానికి సంకేతమా?

అమెరికాలోని దక్షిణ ప్రాంతాలతోపాటు దక్షిణ యూరోప్ ఉష్ణోగ్రతలు( Temperatures of Southern Europe ) ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయనే విషయం అందరికీ విదితమే.అయితే ఇక్కడ కేవలం నేలపై మాత్రమే కాదు, సముద్రంలో కూడా అత్యంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

 Terrible Heat Waves Inside The Oceans A Sign Of The End Of An Age , Sea, Lava,-TeluguStop.com

అదేవిధంగా ఎప్పుడూ లేని రీతిగా జూన్ లో సముద్రాల్లోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం గమనార్హం.ఈ క్రమంలోనే అంచనా వేసే ఉష్ణోగ్రతలు, వాస్తవానికి మధ్య తేడా కూడా జూన్లో చాలా ఎక్కువగా నమోదైందని నేషనల్ ఆఫీస్ ఆఫ్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్వోఏఏ) తాజాగా పేర్కొంది.

Telugu Latest, Lava-Latest News - Telugu

మే నెలలో కూడా అమెరికా, కెనడాల( America , Canada ) పశ్చిమ తీరంలో ఇలాంటి పరిస్థితులే కనిపించడం విశేషం.పశ్చిమ మధ్యధరా సముద్రంలో, ముఖ్యంగా జిబ్రాల్టార్ జల సంధికి సమీపంలో ఒక హీట్వేవ్ తీవ్రం అవుతున్నట్లుగా సమాచారం.మరోవైపు న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి.అదేవిధంగా ఇర్లాండ్, బ్రిటన్ల తీరాలతోపాటు బాల్టిక్ సముద్రంలోనూ( Baltic Sea ) విపరీత ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

దక్షిణ గ్రీన్లాండ్లోని లాబ్రడార్ సముద్రంలోనూ ఒక హీట్వేవ్ విజృంభించే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Telugu Latest, Lava-Latest News - Telugu

ఇక దీర్ఘకాలంపాటు ఇలా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు( Greenhouse gas emissions ) ప్రధాన పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.సముద్రంలో హీట్వేవ్స్ పెరగడానికి వాతావరణంలోని ఏరోసోల్ స్థాయిలు తగ్గడం కూడా ఒక కారణం అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.హీట్ వేవ్స్ అనేవి ప్రస్తుతం మరింత తీవ్రంగా కూడా కావచ్చని చెబుతున్నారు.

ఈ హీట్ వేవ్స్ వలన సముద్రపు జీవులు, చేపలు, వాతావరణం తీవ్రంగా ప్రభావితం కావొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.ఈ కారణంగానే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 2010/2011ల్లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయిన సంగతి అందరికీ తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube