కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంరక్షణ కోసం ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన.మహిళలపై అఘాయిత్యాలు గణనీయంగా పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు.
అమాయక యువతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు కీచుకులు దారుణాలకు పాల్పడుతున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఆర్థిక నష్టాలలో ఉన్న ఒక అమ్మాయిని సహాయం చేస్తానని నమ్మించి, కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి న్యూడ్ వీడియోలు తీసి ఆ అమ్మాయిని బ్లూ ఫిలిం లో నటించాలని బ్లాక్ మెయిల్ చేయడంతో ఏం చేయాలో తెలియక చివరికి పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన ఒక యువతి హైదరాబాదు( Hyderabad )లో ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది.ఈ యువతికి కొన్నేళ్ల క్రితం చిన్న కేశవ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు.ఒకసారి ఆ యువతి చిన్న కేశవ తో తనకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని చెప్పడంతో.
కేశవ ఆర్థిక సమస్యలు తీరాలంటే తాను చెప్పినట్లు వెబ్ సిరీస్ లో నటిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆ యువతీని నమ్మించాడు.
<img src=" https://telugustop.com/wp-content/uploads/2023/08/nude-video-crime-crime-news-Hyderabad-Visakhapatnam.jpg”/>
ఒకేసారి పది లక్షలు వస్తే తన ఆర్థిక పరిస్థితులన్నీ తొలగిపోతాయని భావించిన యువతి వెబ్ సిరీస్( Web series ) లో నటించడానికి అంగీకరించింది.ఈ విషయం చిన్న కేశవ తో చెప్పగా పంజాగుట్టలోని ఒక హోటల్ కు రావాలని పిలిచాడు.ఆ యువతి హోటల్ కి వెళ్ళాక కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
కాసేపటికి ఆ యువతి మత్తులోకి జారుకున్నాక ఆమె ఒంటిపై ఉండే వస్త్రాలను తీసేసి నగ్న ఫోటోలను, వీడియోలను తీశాడు.ఆ యువతి మత్తులోంచి చేరుకున్నాక ఆ ఫోటోలను, వీడియోలను చూపించి బ్లూ ఫిల్మ్ లో నటించాలంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక చివరికి పోలీసులను( Police ) ఆశ్రయించింది.పోలీసులు చిన్న కేశవ పై కేసు నమోదు చేసి అతనిని పట్టుకొని విచారించే పనిలో నిమగ్నమయ్యారు.







