డబుల్ ఇస్మార్ట్ కోసం సంజయ్ రెమ్యూనరేషన్ ఏంతో తెలుసా?

ప్రస్తుత కాలంలో వచ్చే సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇలా సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా సినిమాలో భాగం చేస్తున్నారు.

 Remuneration For Double Smart ,sanjay Dutt ,remuneration ,ram,double Ismart Puri-TeluguStop.com

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలో విలన్ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) కేజిఎఫ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు.

త్వరలోనే ఈయన మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Telugu Bollywood, Double Ismart, Kgf, Puri Jagannath, Sanjay Dutt-Movie

లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( Puri Jagannath )అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఈయన కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది.అయితే ఈ డిజాస్టర్ నుంచి బయటపడటం కోసం పూరి జగన్నాథ్ హీరో రామ్ ( Ram ) తో కలిసి డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాని ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకుంది.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు.

Telugu Bollywood, Double Ismart, Kgf, Puri Jagannath, Sanjay Dutt-Movie

ఇప్పటికే ఈ సినిమా నుంచి సంజయ్ దత్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలచేశారు.అయితే తాజాగా ఈ సినిమా కోసం సంజయ్ దత్ తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ( Remuneration ) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం సంజయ్ దత్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట అయితే ఈయన అడిగినది మొత్తం ఇవ్వడానికి పూరి జగన్నాథ్ ఛార్మి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 60 కాల్ షీట్స్ ఇచ్చారట.ఇందుకోసం ఈయన ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఈయన తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఈ వార్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube