'భోళా శంకర్' కంటే రజినీకాంత్ 'జైలర్' కి ఎక్కువ డిమాండ్..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!

తెలుగు సినిమా అంటే మనకి గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి.( Chiranjeevi ) కమర్షియల్ సినిమాని సరికొత్త పుంతలు తొక్కించిన ఏకైక మెగాస్టార్ ఆయన.

 Rajinikanth Jailer Movie Having More Demand Than Chiranjeevi Bhola Shankar Movie-TeluguStop.com

ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాతే తెలుగు హీరోల డ్యాన్స్ లో వేగం పెరిగింది, ఫైట్స్ స్టైలిష్ గా మారాయి.అంతకు ముందు హీరోల డ్యాన్స్ కి ఫైట్స్ కి పెద్ద తేడా ఉండేది కాదు.

డ్యాన్స్ చేస్తున్నాడా లేదా ఫైట్ చేస్తున్నాడా అని జనాలు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు.చిరంజీవి ఎంట్రీ తో మొత్తం మారిపోయింది.అలా తెలుగు సినీ వినీలాకాసం లో మెగాస్టార్ గా నెంబర్ 1 హీరో గా సుమారు మూడు దశాబ్దాలు కొనసాగిన ఆయన, మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి పది సంవత్సరాలు సినిమాలకు దూరం అయ్యాడు.మళ్ళీ ఆయన ఖైదీ నెంబర్ 150( Khaidi No.150 ) చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చి, మొట్టమొదటి నాన్ రాజమౌళి వంద కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న హీరో గా చరిత్ర సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Telugu Bholashankar, Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh, Jailer, Rajinikan

అలా ఆయన రీ ఎంట్రీ తర్వాత 5 సినిమాలు చేస్తే అందులో మూడు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కులను అందుకున్నాయి.విశేషం ఏమిటంటే చిరంజీవి కి తప్ప మరో స్టార్ హీరోకి ఇన్ని వంద కోట్ల రూపాయిల షేర్ మార్కు సినిమాలు లేవు.అయితే చిరంజీవి ఇప్పుడు అలాంటి అద్భుతమైన తన మార్కెట్ ని చెడగొట్టుకుంటున్నాడా? అని అభిమానులు వాపోతున్నారు.ఎందుకంటే ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు( Remake Movies ) చెయ్యడం అభిమానులకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు.మామూలు ఆడియన్స్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది అనడానికి త్వరలో విడుదల కాబోతున్న ‘భోళా శంకర్’ చిత్రం( Bhola Shankar Movie ) ఒక ఉదాహరణ.

వచ్చే వారం లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో కూడా ఆసక్తి లేదు.మెహర్ రమేష్ డైరెక్టర్ అవ్వడం , అందులోనూ 8 ఏళ్ళ క్రితం విడుదలైన తమిళ సినిమాకి రీమేక్ అవ్వడం అందుకు కారణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Telugu Bholashankar, Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh, Jailer, Rajinikan

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ మరియు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి.ఓవర్సీస్ లో ఈ సినిమాకంటే ఎక్కువగా రజినీకాంత్ జైలర్ కి ( Jailer Movie )మూడు రెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.ఇక హైదరాబాద్ లో అయితే భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్స్ మొన్న ప్రారంభించారు.ప్రారంభం లోనే హైదరాబాద్ లోని టాప్ క్వాలిటీ థియేటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు.

అవి నిమిషాల వ్యవధిలో హౌస్ ఫుల్స్ అవ్వాల్సిన థియేటర్స్.కానీ రెండు రోజులు అవుతున్న కూడా ఇప్పటికీ 50 కూడా హౌస్ ఫుల్స్ కాలేదు.

దీంతో ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ కంటే తక్కువ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.అదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ మరోసారి తీవ్రమైన నిరాశకి గురి అవ్వక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube