శ్రీధర్ బాబు పై కేటీఆర్ ఫైర్.. అవి ఉంటేనే మాట్లాడాలి అంటూ..!!

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో పనుల గురించి చెప్పుకుంటున్నారు.

ఈ తరుణంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గురించి మాట్లాడారు.దీంతో రియాక్ట్ అయినటువంటి కేటీఆర్ ( KTR ) శ్రీధర్ బాబు పై మండిపడ్డారు.

రాష్ట్రంలో వర్షాలు అపారంగా కురిసాయి.దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డది నిజమే.

కానీ వారందరికీ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అధికారులు వర్క్ చేసుకుంటూ వచ్చారు.వరద ప్రభావం వల్ల సోయా, పత్తి రైతులు మాత్రమే కాస్త నష్టపోయారని అన్నారు.

వరి పంటలో రెండు మూడు రోజులు నీళ్లు ఉన్న నష్టం జరగదని తెలిపారు.ఎలాంటి నష్టం జరిగిందో కనీసం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ( Sridhar babu ) తెలుసుకోకుండా గాలి మాటలు మాట్లాడొద్దని కడిగిపారేశారు.

Telugu Revanth Reddy, Rythu Bandu, Rythu Bima, Sridhar Babu-Politics

కేసీఆర్ ( Kcr ) ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చే బెనిఫిట్స్ దేశంలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఇవ్వడం లేదని అన్నారు.రైతు రుణమాఫీ చేయగానే కాంగ్రెస్ వాళ్ళ ఫ్యూజులు అవుట్ అయిపోయాయని, ఇక ఏం మాట్లాడాలో తెలియక గాలి మాటలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ( KTR ) అన్నారు.మీరు చేసే నాటకాలు అన్నిటిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.మీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తానని అన్నాడు, దాన్ని నువ్వు అడగకుండా ఎలాంటి ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడుతున్నావని, నీ దగ్గర వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టాల గురించి ఎలాంటి ఆధారాలున్నా చూపించమని అడిగారు.

అవి ఉంటేనే మాట్లాడాలి లేదంటే లేదు అన్నట్టు శ్రీధర్ బాబు ( Sridhar babu ) నోరు మూసుకునేలా చేశారు.

Telugu Revanth Reddy, Rythu Bandu, Rythu Bima, Sridhar Babu-Politics

ఇప్పటికే రెండుసార్లు రైతు రుణమాఫీ చేశామని, 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి రైతుబంధు ( Rythu bandhu ) అందించామని, రైతు బీమా తెలంగాణలో తప్ప ఇండియాలో ఎక్కడా కూడా లేదని తెలియజేశారు.ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేయవద్దని , ఏదైనా ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు.రైతులకు మూడు గంటల కరెంటు చాలని మీ అధ్యక్షుడు అన్నారని దానిపై నీ సమాధానం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.

రాబోయే ప్రభుత్వం మాదేనని, రైతాంగం ప్రజలంతా మిమ్మల్ని చూస్తున్నారని తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెబుతారని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube