టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.హత్యా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టని విమర్శలు గుప్పించారు.
రూ.2 వేల కోట్లు సంపాదించానని చంద్రబాబు ఆరోపించారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు.ఈ క్రమంలో రూ.20 కోట్లు ఇస్తే మొత్తం చంద్రబాబుకే రాసిస్తానంటూ తెలిపారు.చంద్రబాబు కావాలనే కుట్రపూరితంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో చంద్రబాబు బెదిరింపులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు.చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మళ్లీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడించారు.







