Kalyan Ram : ఆ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధిస్తారా?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల బింబిసారా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Kalyan Ram Devil Will Be Released In Hindi Too-TeluguStop.com

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్.ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్( Abhishek Pictures ) ప్రొడ్యూస్ చేస్తున్న డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ స్పైగా నటిస్తున్నాడు.ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

కాగా ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది.

Telugu Amigos, Bimbisara, Bollywood, Devil, Kalyan Ram, Samyuktha Menon-Movie

ఈ మూవీ నుంచి ఒక్క లీక్ కూడా లేకుండా పెద్దగా హడావుడి చెయ్యకుండా సైలెంట్ గా డెవిల్( Devil ) షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ ఇటీవలే బయటకి వచ్చింది.ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి, కళ్యాణ్ రామ్ కూడా కొత్తగా కనిపించాడు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో, థ్రిల్లింగ్ స్పై జానర్( Thriller ) లో సినిమా అంటే పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.అందుకే మేకర్స్ డెవిల్ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.బీ4యూ మోషన్ పిక్చర్స్ డెవిల్ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నారు.డెవిల్ గ్లిమ్ప్స్ ని హిందీలో రిలీజ్ చేస్తూ మేకర్స్ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

Telugu Amigos, Bimbisara, Bollywood, Devil, Kalyan Ram, Samyuktha Menon-Movie

బింబిసారా( Bimbisara ) సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాల్సిన కళ్యాణ్ రామ్, ఆ టైమ్ లో మిస్ అయ్యాడు కానీ ఈసారి మాత్రం డెవిల్ తో ఆ టార్గెట్ మిస్ అయ్యేలా కనిపించట్లేదు.ఇక బింబిసార కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.మరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారి బడ్జట్ తో రూపొందుతున్న డెవిల్ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనేది చూడాలి మరి.బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తిని చూపిస్తున్న కళ్యాణ్ రామ్ కి ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube