యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.తారక్ నటుడిగా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా తనకు సన్నిహితులైన వాళ్ల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తారక్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను తారక్ గురించి చెప్పగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

నా భార్యకు అబార్షన్ జరిగిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నాకు కాల్ చేశారని నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పారని ప్రభాస్ శ్రీను అన్నారు.యమదొంగ సినిమా( Yamadonga ) సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆ సమయానికి నాకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు కూడా లేదని ప్రభాస్ శ్రీను( Prabhas Sreenu ) వెల్లడించారు.ఇవన్నీ నార్మల్ అని నీకు నెక్స్ట్ పుట్టేటోడు నాలాంటోడు పుడతాడంటూ తారక్ ధైర్యం చెప్పారని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.

నువ్వు ఎక్కడికైనా వెళతావా టికెట్లు వేస్తానని తారక్ నాతో అన్నారని జూనియర్ ఎన్టీఆర్ గొప్పదనం ఇదేనని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనుషులను అంత ప్రేమిస్తారని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్నవాళ్లకు మాత్రం ఆయన గొప్పదనం తెలుస్తుందని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.పాత్రకు అనుగుణంగా తారక్ రియల్ లైఫ్ లో కూడా పలు సందర్భాల్లో బిహేవ్ చేస్తారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ అద్భుతంగా వంట వండుతారని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.నంబర్ ఆఫ్ వెరైటీస్ తారక్ చేస్తారని ఆయన వెల్లడించారు.
ప్రభాస్ శ్రీను వెల్లడించిన విషయాలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.







