Balakrishna : స్టార్ హీరో బాలకృష్ణ ఆ దర్శకుని రుణం తీర్చుకుంటారా.. ఆయనకు చివరి ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ( Hero Balakrishna ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీలు ఇస్తున్నారు బాలయ్య బాబు.

 Bgopal Is Waiting For Balakrishna-TeluguStop.com

ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.అలాగే ఎంతో మంది డైరెక్టర్లతో కలిసి పని చేశారు.

అయితే టాలీవుడ్ లో ఒక దర్శకుడు బాలయ్య బాబుతో ఒక సినిమాను చేసి ఇక దర్శకుడుగా రిటైర్మెంట్ తీసుకుంటాను అని అంటున్నారు.

Telugu Gopal, Balakrishna, Chance, Tirumala, Tollywood-Movie

ఇంతకీ ఆదర్శకుడు ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.ఆ దర్శకుడు మరెవరో కాదు బి.గోపాల్( Director B Gopal ).ఇటీవల కాలంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలో ఆయన కెరీర్ లో జరిగినా ఎన్నో విషయాలను పంచుకున్నారు.బాలకృష్ణ, బి.గోపాల్ ది సూపర్ హిట్ కాంబినేషన్.గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.పల్నాటి బ్రహ్మనాయుడు తర్వాత బాలయ్యతో మళ్లీ సినిమా తీయలేదు బి.గోపాల్.అలా దాదాపు 20 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది.

ఈమధ్య ఒక సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణతో కలిసి కనిపించారు బి.గోపాల్

Telugu Gopal, Balakrishna, Chance, Tirumala, Tollywood-Movie

ఇక అప్పటి నుంచి ఈ కాంబినేషన్ పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.ఆ తర్వాత పలు సందర్భాల్లో బి.గోపాల్ కూడా బాలకృష్ణతో సినిమా చేస్తానని ప్రకటించారు.తాజాగా ఆయన తిరుమల( Tirumala )లో కూడా ఇదే ప్రకటన చేశారు.ఈ సందర్బంగా గోపాల్ మాట్లాడుతూ.బాలయ్య కోసం ఒక సబ్జెక్ట్ చేస్తున్నాము.కథ ఫైనలైజ్ అయిన తర్వాత ఆయన డేట్స్ బట్టి సినిమా ఉంటుంది.

అయితే దీనికి ఇంకా సమయం పడుతుంది.ఎందుకంటే మా కథ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.

ఇటు బాలయ్య కూడా బిజీగా ఉన్నారు.కథ పూర్తయి, దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినంత వరకు చెప్పలేం అని చెప్పుకొచ్చారు.

ఇలా గోపాలకృష్ణ బాలయ్య బాబుతో సినిమా చేయాలని ఉంది అని చెబుతూనే బాలయ్య బాబు డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పకనే చెప్పేసాడు.బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు గోపాలకృష్ణ.

మరి ఈ సీనియర్ దర్శకుడికి బాలకృష్ణ చివరి అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube