2023లో భారతీయులకు స్కెంజెన్ వీసాలు( Schengen Visas ) జారీ చేయడానికి స్విట్జర్లాండ్ బోర్డర్స్ తెరిచింది.భారతీయ పర్యాటక బృందాలకు( Indian Tourists ) వీసా అపాయింట్‌మెంట్లను భారతదేశంలోని స్విస్ రాయబార కార్యాలయం నిలిపివేయలేదు.
అయితే అక్టోబర్ వరకు ఈ వీసాలు అపాయింట్‌మెంట్లను సస్పెండ్ చేశారని మొన్నటిదాకా వార్తలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో స్విస్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.2023, సెప్టెంబర్ వరకు నిత్యం దాదాపు 800 అపాయింట్‌మెంట్లను భారతీయ పర్యాటక బృందాలకు ఇవ్వనున్నామని తెలిపింది.
ఇక 2019తో పోలిస్తే 2023లో ఇప్పటివరకు అత్యధిక వీసాలను భారతదేశానికి ( India ) జారీ చేసింది.జనవరి నుంచి జూన్ వరకు 1.29లక్షల దరఖాస్తులను పరిశీలించింది.కొవిడ్ ముందుతో పోలిస్తే 7.8శాతం ఎక్కువ వీసాలను జారీ చేసింది.ఇండియన్స్ వీసాల ప్రక్రియను 2023లో మరింత ఈజీగా మార్చయడానికి స్విస్ రాయబార కార్యాలయం( Swiss Embassy ) కీలక మార్పులు తీసుకువచ్చింది.
ట్రావెలింగ్ స్టార్ట్ చేయడానికి 6 నెలల ముందే వీసా కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు.ఇంతకుముందు కేవలం నెల ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించేవారు.ఇంత సమయం ఇప్పుడు అందించారు కాబట్టి పర్యాటకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇకపోతే లక్నో అప్లికేషన్ సెంటర్‌ను త్వరలోనే భారతీయులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్విస్ కార్యాలయం తెలిపింది.ఈ సెంటర్ తో ఇండియాలో మొత్తం అప్లికేషన్ సెంటర్ల సంఖ్య 13కు ఎగబాకుతుంది.
స్విస్ రాయబార కార్యాలయం యొక్క తాజా ప్రకటన ప్రకారం, వీఎఫ్‌ఎస్( VFS ) ద్వారా దరఖాస్తు చేసిన వీసాలపై నిర్ణయం 13 రోజుల్లోపు వెల్లడించడం జరుగుతుంది.గతంలో ఒక అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా లేదా అనే దానిపై నిర్ణయం చెప్పడానికి 21 రోజులు పట్టేది.ఈ మార్పు భారతీయ పౌరులకు స్కెంజెన్ వీసా పొందడం సులభతరం చేస్తుంది.స్కెంజెన్ వీసా అనేది ఐరోపా దేశాల మధ్య 90 రోజుల వరకు పర్యటించేందుకు వీలు కల్పించే వీసా.
ఏదైనా స్కెంజెన్ దేశం దీనిని జారీ చేస్తే, దానిపై ఇతర స్కెంజెన్ దేశాల్లో కూడా పర్యటించేందుకు అనుమతి లభిస్తుంది.