టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.2018లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకు అయినా పునాది వేశారా అని నిలదీసిన మంత్రి అంబటి ఏదైనా ప్రాజెక్టును పూర్తి చేస్తే చెప్పాలన్నారు.
చంద్రబాబుకు శంకుస్థాపనలు చేయడం తప్ప పూర్తి చేయడం తెలియదన్నారు.బ్రో సినిమా గురించి, పవన్ ను విమర్శిస్తే చంద్రబాబుకు బాధ కలుగుతుందని విమర్శలు చేశారు.సినిమాలో అన్నదమ్ముల తరహాలో దత్తతండ్రికి, దత్తపుత్రుడి మధ్య సంబంధం బలంగా ఉందని ఎద్దేవా చేశారు.







