ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సాకే భారతి( saake bharati ) ఒకరు కాగా యూట్యూబ్ వీడియోల ద్వారా ఆమె ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.కూలి పని చేస్తూ పీహెచ్డీ పూర్తి చేసిన స్థాయికి ఎదిగిన సాకే భారతి సక్సెస్ స్టోరీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.
ఆమె ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం( AP Govt ) ఆమెకు ఎస్కే యూనివర్సిటీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం ఇచ్చింది.ఆమె ఆర్థిక కష్టాలు తీర్చడానికి రెండెకరాల పొలం ఇవ్వడంతో పాటు ఇంటిని నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే ప్రభుత్వం ఇచ్చిన జూనియర్ లెక్చరర్ పోస్ట్ మాత్రం తనకు వద్దని సాకే భారతి వెల్లడించడం గమనార్హం.ప్రముఖ న్యూస్ ఛానల్ తో ఆమె మాట్లాడుతూ కాంట్రాక్ట్ విధానంలో జేఎల్ పోస్ట్ ఇస్తామని చెప్పారని నేను ఎస్కేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్ ల్యాగ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని ఆమె అన్నారు.

వీసీ రాజగోపాల్( VC Rajagopal ) గారు నాకు అక్కడే ఉద్యోగం వస్తుందని చెప్పారని ఆమె తెలిపారు.జేఎల్ ఉద్యోగం నా చదువుకు తగిన ఉద్యోగం కాదని అర్హతకు తగిన జాబ్ నాకు ఇస్తే బాగుంటుందని సాకే భారతి చెప్పుకొచ్చారు.జేఎల్ పోస్ట్ డిగ్రీ, బీఈడీ లెవెల్ అని అంత చిన్న ఉద్యోగం ఇస్తే పీహెచ్డీ చేసి వేస్ట్ అని ఆమె కామెంట్లు చేశారు.ఆమె కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట ఉద్యోగంలో చేరి ఆ తర్వాత మంచి ఉద్యోగం దిశగా అడుగులు వేస్తే సాకే భారతి కెరీర్ కు మేలు జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పీహెచ్డీ చేసినా ఉద్యోగం లేనివాళ్లు ఎంతోమంది ఉన్నారని ప్రభుత్వం ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







