జెడి చక్రవర్తి ( Jd Chakravarthy ) పరిచయం అవసరం లేని పేరు.శివ సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైనటువంటి ఈయన అనంతరం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే ఉన్నఫలంగా ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి జె.డి చక్రవర్తి సినిమాలు వెబ్ సిరీస్( Web series ) ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే ఈయన దయ ( Daya ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో హాజరైనటువంటి ఈయనకు వెబ్ సిరీస్ లలో సినిమాలలో వస్తున్నటువంటి బోల్డ్ కంటెంట్( Bold content ) గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.అయితే వీటి గురించి జెడి చక్రవర్తి మాట్లాడుతూ పొట్టి బట్టలు వేసుకుంటేనే సినిమాలు హిట్ అవుతాయి అంటే అందులో ఏమాత్రం నిజం లేదని ఈయన తెలియచేశారు.
బాహుబలి, పుష్ప, RRRవంటి సినిమాలలో ఇలాంటి దుస్తులు వేసుకోలేదు కానీ అవి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యాయాన్ని తెలిపారు.

ఎప్పుడైతే దర్శకుడికి వారి కథ పై నమ్మకం లేకుండా పోతుందో ఆ సమయంలోనే బూతు పదాలను అలాగే అడల్ట్ కంటెంట్ ఉపయోగిస్తారు అంటూ ఈ సందర్భంగా జెడి చక్రవర్తి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకవెబ్ సిరీస్లో సంగతి వేరు అక్కడ రియల్ కంటెంట్ చూపించాలి అనుకుంటున్నారు కాబట్టి ఇలా చూపిస్తున్నారని అనవసరంగా ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ లను తెరకెక్కించడం కూడా తప్పని ఈయన తెలిపారు.దర్శకుడు అనుకుంటే సినిమాకు సెన్సార్ అవసరం లేదని తెలిపారు.
తన బుర్రకుసెన్సార్ ఉంటే చాలు అంటూ ఈ సందర్భంగా జెడి చక్రవర్తి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







