జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వే చేసేందుకు అలహాబాద్ రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది.న్యాయం చేకూరాలంటే సర్వే అవసరం అని పేర్కొంది.

 Allahabad High Court Permits Asi Survey In Gnanavapi Masjid-TeluguStop.com

అయితే ఏఎస్ఐ సర్వేను వ్యతిరేకిస్తూ మసీద్ కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.దీంతో సర్వేను తాత్కాళికంగా నిలిపివేయాలన్న సుప్రీం ధర్మాసనం అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

ఈ క్రమంలో అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేసిన మసీద్ కమిటీ సర్వే నిర్వహించవద్దని ఆ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది.అయితే మసీద్ కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చిన అలహాబాద్ కోర్టు వారణాసి కోర్టు తీర్పును సమర్థించింది.

దీని ప్రకారం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా జ్ఞానవాపి మసీద్ ఒకప్పుడు ఆలయమా.? కాదా .? అన్న విషయాన్ని తేల్చేందుకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube