1.బ్రో సినిమాపై ఫిర్యాదుకు ఢిల్లీకి అంబటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా( Bro movie ) లో శ్యాంబాబు అని పాత్ర ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబును పోలింగ్ ఉందంటూ వైరల్ అవుతుంది.ఈ సినిమాపై ఫిర్యాదు చేసేందుకు మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్తున్నారు.ఈ చిత్రానికి అమెరికా నుంచి అక్రమంగా ఫండింగ్ జరిగిందని రాంబాబు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు.
2.మందుబాబులకు చంద్రబాబు హామీ
నంద్యాల జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో టిడిపి అధినేత చంద్రబాబు మందుబాబులకు హామీ ఇచ్చారు.టిడిపి అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
3.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పంపిణి
ఆగస్టు 15 నుంచి తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్( K.T.Rama Rao ) ప్రకటించారు.
4.పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగుల కోసం అన్ని అర్హతలు కలిగి నిర్ణీత పరీక్షల్లో ఉత్తీర్ణత కలిగిన యువతకు నియామకాలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచామని ప్రకటన ఇవ్వడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ఈ విషయం రైల్వే అధికారులకు పవన్ విజ్ఞప్తి చేశారు.
5.నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
నేడు జిఎస్టి కౌన్సిల్ వర్చువల్ సమావేశం జరగనుంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్( Nirmala Sitharaman ) ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
6.మూడు రోజులు పాటు వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
7.మళ్లీ పెళ్లి చిత్రం విడుదలపై దాఖలైన కేసు కొట్టివేత
మళ్లీ పెళ్లి చిత్రం విడుదలపై దాఖలైన కేసును సిటీ సివిల్ కొట్టివేసింది .నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి , మట్టే మధువే కన్నడ చిత్రాన్ని థియేటర్లు, ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి నిలుపేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టి వేసింది.
8.జీవో 79 పై పోలీస్ సంఘాలు నోరు విప్పాలి
పోలీస్ అలవెన్స్ లో కోతలు విధించడం దారుణమని , జీవో 79 పై పోలీస్ సంఘాలు నోరు విప్పాలి అని టిడిపి పొలిట్ బ్యూర్ సభ్యుడు బోండా ఉమా విజ్ఞప్తి చేశారు.
9.మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే
రానున్న ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
10.కునోలో మరో చీత మృతి
మధ్యప్రదేశ్ లోని కును జాతీయ పార్కులో చీతాల మరణాలు ఆగడం లేదు.ఈరోజు ఉదయం మరో చీతా చనిపోయింది.
11.పెళ్లి వార్తలపై తరుణ్ కామెంట్స్
తాను పెళ్లి చేసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఒకవేళ కుదిరితే ఆ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తానని సినీ హీరో తరుణ్ అన్నారు.
12.వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన
వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పర్యటించారు.
13.జువెలింగ్ త్రో ఎంపిక పోటీలు ప్రారంభం
అదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో ఈరోజు నిర్వహించిన 100,400 మీటర్ల జావెలింగ్ త్రో ఎంపిక పోటీలను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భోజా రెడ్డి ప్రారంభించారు.
14.భట్టి విక్రమార్క కామెంట్స్
తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు వంటి ఆకాంక్ష నెరవేరలేదని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క అన్నారు.
15.శిల్పారామంలో జాబ్ మేళా
మహబూబ్నగర్ లో నూతనంగా నిర్మించిన ఐటీ కారిడార్ లోని కంపెనీలో నియామకాల కోసం ఈనెల 9న శిల్పారామంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు
16.మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్
మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడం ఎన్నికల స్టంట్ , మాది రాజకీయ పార్టీ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
17.బిజెపి నేతల సమావేశం
ఈరోజు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశం అవుతున్నారు.
17.ఈటెల రాజేందర్ విమర్శలు
తెలంగాణలో మంత్రులు సీఎం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాలు పంటలు దెబ్బ తిన్నాయని బిజెపి నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) విమర్శించారు.
18.షర్మిల చేరికపై భట్టి విక్రమార్క కామెంట్స్
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల చేరిక అంశం నా దృష్టిలో లేదు అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
19.నేడు కాంగ్రెస్ లో చేరనున్న జూపల్లి కృష్ణారావు
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరనున్నారు.
20.తెలంగాణలో టెట్ కు నేటి నుంచి దరఖాస్తులు
తెలంగాణలో సెప్టెంబర్ 10 నిర్వహించనున్నారు.ఈ మేరకు నేటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.