కే‌సి‌ఆర్ ఒంటరి పోరు.. తాత్కాలికమేనా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( KCR ) జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.దేశమంతా తెలంగాణ మోడల్ తీసుకురావాలని, రైతుల ధ్యేయమే ప్రధాన లక్ష్యంగా కే‌సి‌ఆర్ దేశ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు.

 Is Kcr's Single Fight Temporary , Kcr, India , Congress, Political Experts, Te-TeluguStop.com

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దె దించడమే తన లక్ష్యమని కే‌సి‌ఆర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.దీంతో మోడీని దగ్గే దించేందుకు కే‌సి‌ఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని విపక్షలను కే‌సి‌ఆర్ ఏకం చేయబోతున్నారని గట్టిగానే నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

కట్ చేస్తే కే‌సి‌ఆర్ సైడ్ అయి బిహార్ సి‌ఎం నితిశ్ కుమార్ లైన్ లోకి వచ్చారు.

Telugu Congress, India, Kcrs Temporary, Telangana-Politics

విపక్షలను ఒకే తాటిపైకి తీసుకోచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించి కాంగ్రెస్ ( Congress )తో ” INDIA ” కూటమిని ఏర్పరచారు.ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.INDIA కూటమి ఏర్పడక ముందు నితిశ్ కుమార్ మరియు కే‌సి‌ఆర్ పలు మార్లు భేటీ అయి కూటమి పై చర్చలు కూడా జరిపారు.

కానీ ప్రస్తుతం ఏర్పడిన INDIA కూటమిలో కే‌సి‌ఆర్ లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.కాగా ఇటీవల పొత్తులపై కే‌సి‌ఆర్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

జాతీయ రాజకీయాల్లో అటు ఎన్డీయేతో గాని, ఇటు ఇండియా కూటమితో గాని పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు.

Telugu Congress, India, Kcrs Temporary, Telangana-Politics

దీంతో సార్వత్రిక ఎన్నికల్లో( general election ) బి‌ఆర్‌ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగబోతుందనేది తేటతెల్లమైంది.అయితే బి‌ఆర్‌ఎస్ కు ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా అంటే సందేహమే.ఎందుకంటే ఇప్పుడిప్పుడే దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బి‌ఆర్‌ఎస్.

కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు పోటీనిచ్చే దిశగా ఎదగలంటే అంతా సులువైన విషయం కాదు.కాబట్టి ఇతర పార్టీలతో కలుపుకొని వెళ్లాల్సిన అవసరత ఉందనేది రాజకీయ నిపుణుల( Political experts ) అభిప్రాయం.

అంటుకే అటు ఎన్డీయే కూటమితో గాని ఇటు విపక్ష కూటమితో గాని కలవని పార్టీలతో కలిసి మరో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కే‌సి‌ఆర్ వ్యూహాలు రఃకించిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.మరి ఎన్నికల సమయానికి పొత్తుల విషయంలో కే‌సి‌ఆర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube