మాధవీ లత( Madhavi Latha) పరిచయం అవసరం లేని పేరు.నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమె ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు.ఈ విధంగా మాధవి లత ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
అయితే కొన్నిసార్లు ఈమె చేసే వ్యాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగుతూ ఉంటాయి.ఇలా ఇండస్ట్రీలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తున్నారు.

ఇకపోతే మాధవి లత గతంలో పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు.పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒక్కటే వస్తే సరిపోదని తెలిపారు.వయసుతో పాటు మనం మానసికంగా శారీరకంగా కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనప్పుడే పెళ్లి చేసుకోవాలి అంటూ పెళ్లి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.అయితే ఈ విషయాలన్నింటినీ తెలియజేసిన అతి కొద్ది రోజులలోనే ఈమె కూడా పెళ్లికి సిద్ధం కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తెలియచేశారు.

ఈ విధంగా మాధవి లత త్వరలోనే పెళ్లి (Marriage ) చేసుకోవడానికి సిద్ధమైందని తెలియజేసిన ఈమె తనకు కాబోయే భర్త ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా తెలియచేయలేదు.అయితే ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మాత్రం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కు చెందిన వారని తెలుస్తుంది.మరి ఈమె కాబోయే వాడి గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈమె ఆయన వివరాలన్నింటినీ తెలియజేయాల్సి ఉంటుంది.
ఇక సినిమా ఇండస్ట్రీలో కొంతకాలం పాటు కొనసాగిన మాధవి లత అనంతరం బిజెపి( BJP ) పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ రాజకీయాల( Politics ) లో కూడా కొనసాగారు అయితే ప్రస్తుతం రాజకీయాలకు కూడా ఈమె దూరమయ్యారని తెలుస్తోంది







