వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.‘బ్రో’ సినిమా లావాదేవీలపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు మంత్రి అంబటి ఫిర్యాదు చేయనున్నారు.
అయితే బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పోలిన సన్నివేశం ఉన్న నేపథ్యంలో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పాత్రను పోషించిన పృథ్వీ మరియు సినిమా నిర్మాత చేసిన కొన్ని వ్యాఖ్యలపై మంత్రి అంబటి సీరియస్ అయ్యారు.
ఈ క్రమంలోనే హస్తినకు వెళ్తున్న ఆయన సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరనున్నారని సమాచారం.







