పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రధాన పాత్ర లో నటించిన ‘బ్రో ది అవతార్( Bro movie )’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తియ్యడం, దానికి తోడు సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ చెయ్యడం వల్ల ఈ చిత్రానికి అలా డివైడ్ టాక్ వచ్చింది.
కానీ పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల ఈ చిత్రానికి మొదటి మూడు రోజులు అసలు టికెట్స్ దొరకకుండా ఆడింది.ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.
కానీ అదంతా కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల వచ్చిన ఓపెనింగ్స్.ఓపెనింగ్ వీకెండ్ కాకుండా, మామూలు ఔర్కింగ్ డేస్ లో కూడా సినిమా నిలబడాలంటే కచ్చితంగా కంటెంట్ లో దమ్ము ఉండాలి.

‘బ్రో ది అవతార్’ చిత్రం లో ఆ దమ్ము లేదు, అందుకే వీకెండ్ తర్వాత నాల్గవ రోజు 70 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి.ఒక సినిమాకి ఆ రేంజ్ డ్రాప్స్ రావడం అనేది మంచిది కాదు.ఆదివారం వచ్చిన వసూళ్ళలో కనీసం 60 శాతం వసూళ్లు హోల్డ్ చెయ్యగలిగితే మంచి ట్రెండ్ లో ఉన్నట్టు లెక్క.కానీ ‘బ్రో ది అవతార్’ విషయం లో అది జరగలేదు.
ఫలితంగా నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.అయితే ఇంత టాక్ లో కూడా ఈ చిత్రం పలు ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అయ్యింది.
అలాంటి ప్రాంతాలలో ఒకటి కర్ణాటక( Karnataka ) మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా.ఈ రెండు ప్రాంతాలలో ఈ సినిమా బేక్ ఈవెన్ అయ్యింది.ఇక ఈ వీకెండ్ లోనే ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సంపూర్ణంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇకపోతే ఈ చిత్రానికి ఐదవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి.నాల్గవ రోజు రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, ఐదవ రోజు కూడా రెండు కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ ని రాబట్టింది.అలా మొత్తం మీద 5 రోజులకు ఈ సినిమా వంద కోట్ల రూపాయిల గ్రాస్, 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇదే రేంజ్ ఊపు ని కొనసాగిస్తే ఈ చిత్రం కచ్చితంగా 80 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.మరి ఈ సినిమా ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది ఈ వీకెండ్ తో అర్థం అవుతుంది.







