భారతీయ అమెరికన్ ఇంజనీర్ అనిల్ వార్ష్నే (Anil Varshney) హిందీలో మాట్లాడినందుకే తన జాబ్ కోల్పోయారు.2011 నుంచి పార్సన్స్ కార్పొరేషన్‌లో సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఈ ఇండియన్ అమెరికన్ 2022లో అనూహ్యంగా కొలువు కోల్పోయారు.2022లో అతను ఆఫీస్‌లో ఉన్న సమయంలో రెండు నిమిషాల పాటు భారత్‌లోని తన బంధువుతో హిందీలో( Hindi ) మాట్లాడారు.హాస్పటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్న తన బంధువు కేఎస్ గుప్తాతో చివరిసారిగా మాట్లాడటం తప్పనిసరి కావడంతో ఈ ఇంజనీర్ వీడియో కాల్ చేసి మాట్లాడారు.2022 సెప్టెంబర్ 26న ఈ కాల్ చేయడం జరిగింది.
ఇదే సమయంలో అనిల్ హిందీలో మాట్లాడటాన్ని మరొక ఉద్యోగి గమనించాడు.
అనంతరం అనిల్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని, సంస్థకు చెందిన కీలకమైన రహస్య సమాచారాన్ని ఫోన్ ద్వారా లీక్ చేశారని ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించారు.ఆ విధంగా వీడియోకాల్ మాట్లాడినందుకు అతనిపై పార్సన్స్ కార్పొరేషన్( Parsons Corporation ) శిక్ష విధించింది.78 ఏళ్ల అనిల్‌ను ఉద్యోగం నుంచి నిర్ధాక్షణంగా తొలగించింది.

తనను విధుల్లో నుంచి తొలగించడం హిందూ వివక్ష చర్యగా వార్ష్నే వాదించారు.అలబామా కోర్టులో( Alabama Court ) దావా వేశారు.యునైటెడ్ స్టేట్స్ మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీలో తనను పదవి నుంచి తొలగించడం వల్ల తనకు భవిష్యత్తులో ఆ ఏజెన్సీలో పనిచేసే అవకాశం లేదని అతను పేర్కొన్నారు.
పార్సన్స్ కార్పొరేషన్ వార్ష్నేను విధుల్లో నుండి తొలగించడంలో ఎలాంటి పొరపాటు జరగలేదని వాదించింది.కోర్టును ఆ దావాను తిరస్కరించాలని కోరింది.పెరుగుతున్న కోర్టు ఖర్చులను కూడా అనిల్ భరించాలని డిమాండ్ చేసింది.

కోర్టు ఇంకా దావాపై తీర్పు ఇవ్వలేదు.ఒకవేళ ఉద్యోగంలో చేర్చుకోలేని పక్షంలో బెనిఫిట్స్ తో సహా ఫ్రంట్ పే చేయాలనే డిమాండ్ వినిపించారు.ఇకపోతే హంట్స్‌విల్లేలో అనిల్ ఫ్యామిలీ తో సహా స్థిరపడ్డారు.1968లో అమెరికాకి( America ) ఉద్యోగరీత్యా వెళ్లిన ఈ ఎన్నారై అక్కడే పని చేస్తూ అమెరికన్ పౌరసత్వం పొందారు.అనిల్ సతీమణి శశి 1989 నుంచి నాసాలో ఒక మంచి ఉద్యోగంలో కొనసాగుతున్నారు.








