వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో మిష్టర్, అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ( Lavanya tripathi )పెళ్లి ఈ నెల చివరి వారంలో జరగనుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించి భారీ స్థాయిలో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ లావణ్య పెళ్లి చేసుకుని ఏడడుగులు నడవాలని భావిస్తున్నారు.
ఆగష్టు నెల 24వ తేదీన పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఇటలీలో తొలిసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిశారు.
అందువల్ల ఇటలీలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది.

రాజరిక పద్ధతిలో వరుణ్ తేజ్( Varun tej ) లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.పలువురు వెడ్డింగ్ ప్లానర్స్ వీళ్లిద్దరి పెళ్లి కోసం పని చేస్తున్నారని బోగట్టా.ఈ పెళ్లికి కేవలం 50 మంది మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుందని సినీ, రాజకీయ ప్రముఖులను ఈ ఈవెంట్ కు ఆహ్వానం అందనుందని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వరుణ్ లావణ్యలను అభిమానించే అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.వరుణ్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా కలిసి సినిమాలలో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది.వరుణ్ తేజ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







