ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "ఠాణా దివస్"

ప్రజల వద్ద నుండి స్వయంగా వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఠాణా దివస్ లో ప్రజల వద్ద నుండి 109 ఫిర్యాదులు స్వీకరణ,జిల్లా ఎస్పీ అఖిల్( SP Akhil ) మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ వెళ్ళడానికి,వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో ఒక రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి అట్టి సమస్యలు పరిష్కరిస్తు ప్రజలకు భరోసా కల్పిస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం.బోయినిపల్లి పోలీస్ స్టేషన్లో( Boinipally Police Station ) మంగళవారం రోజున “ఠాణా దివస్” కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 "thana Divas" Aims To Solve People's Problems-TeluguStop.com

ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుండి 109 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జరిచేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ లపై నమ్మకం కలిగేలా, దివ్యాంగులు, వృద్ధులు, దూరప్రాంతల నుండి తన కార్యాలయనికి రాలేని వారి వద్దకే పోలీస్ సేవలు అందలనే ఉద్దేశ్యంతో “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోగ్రామ్స్ నిర్వహిస్తు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం అవుతూ గ్రామాలలో శాంతి భద్రతను పరిరక్షణకై కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని,సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నరు.భూ తగాధాలలో క్రిమినల్ సమస్య ఉన్న ఫిర్యాదులలో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించామని, సివిల్ సమస్యకు సంబంధించిన పిర్యాదులను కోర్టు లో పరిష్కరించుకోవాలని దానికోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పిస్తాం అన్నారు.

ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యలు మేము పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేసే వారిపై మాకు ఫిర్యాదులు వస్తే చట్టపరపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.వేములవాడ రూరల్, టౌన్, ఎల్లారెడ్డిపేట్, ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లలో నిర్వహించిన “ఠాణా దివస్” కార్యక్రమంలో వచ్చిన 43 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయడం జరిగిందని,కొన్ని ఫిర్యాదులలో ఇతర శాఖలకు రాయడం జరిగింది అని,కొన్ని పిర్యాదులలో మహిళ సంబంధించిన సమస్యలను జిల్లా షీ టీమ్, సఖి సెంటర్ కి రాయడం జరిగింది అని,కొన్ని పిర్యాదులలో ఇరు వర్గాల వారిని పిలిపించి వారి సమస్యలను పరిష్కరించామని, సివిల్ సమస్య ఉన్న పిర్యాదులలో కోర్టు వెళ్లాలని సూచించమన్నారు.

కోర్టు ని ఏ విధంగా సంప్రదించలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.జిల్లా ఎస్పీ స్వయంగా తమ దగ్గరికి వచ్చి ఓపికతో తమ ఫిర్యాదులు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్న అర్జీదారులు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కృష్ణకుమార్, ఎస్.ఐ మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube