తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని విమర్శించారు.
వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా మహారాష్ట్ర వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.మానవత్వం ఉన్నవారు ఇలాంటి రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి, ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం స్పందించి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.







