యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని( Ram Pothineni ) ఒకరు.ఈయన వారియర్ సినిమాతో ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు.
లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు.అప్పటి నుండి రామ్ మాస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ యాక్షన్ సినిమాలను వరుసగా లైన్లో పెట్టుకుంటూ పోతున్నాడు.

ప్రజెంట్ రామ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్( Boyapati Srinivas ) తో చేస్తున్న స్కంద ఒకటి.రామ్ హీరోగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అందుకే వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోగా ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్( Skanda Movie First Single ) ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలోనే ఈ ఫస్ట్ సింగిల్ కు డేట్ అండ్ టైం ఫిక్స్ చేస్తూ మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.

స్కంద( Skanda ) నుండి ‘నీ చుట్టూ చుట్టూ’ అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ను ఆగస్టు 3న ఉదయం 9 గంటల 36 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.అలాగే కొద్దిసేపటి క్రితం ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు.ప్రోమో చూస్తుంటే సాంగ్ అదిరిపోయేలా కనిపిస్తుంది.మరి పూర్తి సాంగ్ ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాల్సిందే.ఇక ఇదిలా ఉండగా థమన్( Thaman ) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.







