ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ పై( Volunteers ) విపరీతమైన చర్చ జరుగుతుంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వo( YCP ) అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ.
ఇది పూర్తిస్థాయి ప్రభుత్వ వ్యవస్థ కాదు.సంక్షేమ పథకాలు అమలు కోసం గౌరవ వేతనాన్ని ప్రజాదనం నుంచి జీతం గా ఇస్తూ వీరి చేత ప్రభుత్వం కొన్ని కీలక బాధ్యతలు నిర్వహింపచేస్తుంది.
అయితే వీరినియామకం లో ఎటువంటి మార్గదర్శకాలు , పరీక్షలు గాని లేవు.ప్రభుత్వ అజామాయిషీ కూడా లేకపోవడంతో నెలలో కొన్ని రోజులు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మిగిలిన రోజుల్లో తమ తమకు తోచిన పని చేసుకుంటున్నారు
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలులో భాగంగా వీరు సేకరిస్తున్న సమాచారానికి ( Data ) ఎటువంటి రక్షణ లేదని ఈ సమాచారం దుర్వినియోగం అవ్వడమే కాక లబ్ధిదారులు వ్యక్తిగత వ్యవహారాలు తెలుసుకున్న వాలంటీర్లు వాటిని అక్రమ మార్గంలో ఉపయోగించుకునే అవకాశం ఉందంటూ జనసేన అధినేత తన వరాహి యాత్ర కేంద్రంగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
వాలంటీర్ వ్యవస్థ పై పవన్( Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన అధికారపక్షం వాలంటీర్లచే తీవ్ర స్థాయి నిరసన ప్రదర్శనలు చేయించి దిష్టిబొమ్మలు దగ్ధం చేపించింది.అయితే వాలంటీర్ వ్యవస్థ తాలూకూ ధుష్పరిణామాలు ఇప్పుడు కాళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి .ఒకటి తర్వాత ఒకటి ఈ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు చేస్తున్న దారుణాలు సభ్య సమాజం భయంతో వణికిపోయేలా ఉన్నాయి.
ముఖ్యంగా అనేక హత్యలు ,కుంభకోణాలు, రేప్ కేసులలో వాలంటీర్లు నిందితులుగా తేలడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది.నియంత్రణ లేని వ్యవస్థ ఎప్పటికైనా ప్రమాదమేనని దీనిని ఒక రాజకీయ అంశంగా కాకుండా సామాజిక అంశముగా చూసి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని ఈ వ్యవస్త పై స్పష్టమైన విది విదానాలను రూపొందిస్తుందో లేక తమ ఎన్నికల ప్రయోజనం గురిచే ఆలోచస్తుందో వేచి చూడాలి
.