ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...

చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లను( Bank Accounts ) కలిగి ఉంటారు.రెండు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉండటం కొంతవరకు బెటర్.

 Having Multiple Bank Accounts Things You Should Keep In Mind Details, Banking Ne-TeluguStop.com

కానీ ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటం వల్ల ఎలాంటి లాభాలు ఉండకపోగా.నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.

బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్( Minimum Balance ) అనేది మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ అలా మెయింటెన్ చేయకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి.ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటం వల్ల ప్రతి దానిలోనే మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంది.ఉంచకపోతే పెనాల్టీలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.అంతేకాకుండా ప్రతి అకౌంట్ బ్యాలెన్స్‌ను ట్రాక్ చేయడం కూడా కష్టతరం అవుతుంది.

Telugu Frauds, Latest, Minimum Balance, Minimum, Multiple Bank, Penalty-Latest N

ఇక ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ కలిగి ఉన్నప్పుడు సైబర్ మోసాల( Cyber Fraud ) బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.చాలామంది అన్ని బ్యాంకులకు ఒకే యూపీఐ పిన్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్‌కు ఒకే పాస్ వర్డ్ పెట్టుకుంటారు.దీని వల్ల సైబర్ నేరాలకు సులువుగా దొరికిపోతారు.ఇక ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఎక్కువకాలం వాడకపోతే బ్యాంకులు ఇన్‌యాక్టివ్ చేస్తాయి.

Telugu Frauds, Latest, Minimum Balance, Minimum, Multiple Bank, Penalty-Latest N

మళ్లీ అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే ఎక్స్ ట్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.ఇక బ్యాంకులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఎస్సెమ్మెస్ సేవల వినియోగంపై ఛార్జీలు వసూలు చేస్తాయి.ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటం వల్ల ప్రతి బ్యాంకుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.దీంతో రెండు లేదా మూడు బ్యాంకు అకౌంట్లు కలిగి ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అకౌంట్లు అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ అకౌంట్లు కలిగి ఉండటం వల్ల భారం తప్పితే ఉపయోగాలు ఉండవంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube