ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) బలియా జిల్లాలో ఒక ఎద్దు సైకోగా మారింది.ఇది గత కొన్ని రోజులుగా బీభత్సం సృష్టిస్తూ ఇప్పటికే దాదాపు 12 మందిని తీవ్రంగా గాయపరిచింది.
ఈ క్రమంలోనే శుక్రవారం, ఎద్దు కకనూ అనే రైతుపై దాడి చేసింది.ఇది ఊహించని సదరు రైతు భయంతో పరుగులు తీసాడు.
చివరికి చెట్టు ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు, కానీ ఎద్దు ఏదో పగబట్టినట్టు, అతడిపై ప్రతీకారం తీర్చుకోవడమే తన జీవిత ఆశయం అన్నట్లు చెట్టు కిందనే నిరీక్షించింది.
రెండు గంటల పాటు, ఎద్దు( Bull ) రైతును బెదిరించింది.
అతను కదులుతుంటే దాడి చేసింది.చివరికి, ఒక అపరిచిత వ్యక్తి సెల్ ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించాడు.
అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సమీపంలో చెట్టు( Tree ) ఉండబట్టి అతని ప్రాణాలు దక్కాయి.
చూసేందుకు ఇది చాలా హారర్ గా ఉంది.ఇది అనుభవించిన ఆ రైతు( Farmer ) ప్రాణభయంతో ఇంకెంత హడలిపోయాడో ఏమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్( Akhilesh Yadav ) దృష్టికి కూడా ఈ షాకింగ్ ఘటన వెళ్లింది.ఇది చూసి ఆయన కూడా ప్రజల ప్రాణాలకు ఇలాంటి ఎద్దుల వల్ల ప్రాణహాని పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి దూకుడు ఎద్దులని అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన యూపీ ప్రభుత్వాన్ని కోరారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం, ఆ ఎద్దును పట్టుకుని, ప్రజలకు దూరంగా తీసుకెళ్లేందుకు పోలీసు టీమ్ ఏర్పాటు అయింది.

ఆల్రెడీ గాలింపు చర్యలు కూడా మొదలయ్యాయి.దానిని త్వరగా పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఆవులు, ఎద్దులు దాడి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి.పిచ్చిగా మారిన ఎద్దులు తరచుగా ప్రజల మీదకు ఎగ బడుతూ వారి ఎముకలు ఇరిగేలా గాయపరుస్తున్నాయి.
ఈ సంఘటనలు ప్రజలు పిచ్చిగా మారిన ఎద్దుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై స్పృహ పెంచుతున్నాయి.







