టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్నంత స్టార్ పవర్ మరో హీరోకి లేదని ట్రేడ్ పండితులు సైతం అంటూ ఉంటారు.అది నిజమే అని పలు సందర్భాలలో మన అనుభవాల కొద్దీ మనం కూడా తెలుసుకుంటూ ఉంటాము.
రీసెంట్ గా విడుదలైన ‘బ్రో ది అవతార్’ చిత్రం( Bro movie ) అందుకు ఉదాహరణ.ఈ సినిమా చూడగానే పవన్ కళ్యాణ్ ఇలాంటి మామూలు సినిమా తీశాడేంటి.?, ఒక్క ఫైట్ లేదు, ఒక్క పాట లేదు, సినిమా మొత్తం పక్కనే కూర్చొని నవ్వుతూ ఉంటాడు.

కనీసం వారం రోజులైనా ఈ సినిమా ఆడుతుందా అని అందరూ అనుకున్నారు.కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అదే రేంజ్ ఊపు ని మొదటి మూడు రోజులు కొనసాగించింది ఈ చిత్రం.
ఇలాంటి సినిమాకి కూడా ఈ రేంజ్ వసూళ్లు పెట్టినందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాత్రమే కాదు.ఇతర హీరోల అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యారు.

మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయిల షేర్, వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆల్ టైం టాప్ 3 బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిల్చింది.మొదటి మూడు రోజులు చాలా బాగా నెట్టుకొచ్చాడు, కానీ సోమవారం నుండి ఈ సినిమా తేలిపోతుందిలే అని అనుకున్నారు కొంతమంది.కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఈ చిత్రం సోమవారం నూన్ షోస్ నుండే డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లింది.ప్రతీ షో కి ఇంప్రూవ్ అవుతూ వచ్చిన ఈ సినిమా మొన్న విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం( Adipurush ) కంటే ఎంతో బెటర్ వసూళ్లను రాబట్టింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి సోమవారం నాడు 5 నుండి 6 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.







