తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ ( Bjp ) సముద్రంలో అలల లాగా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ముందుకు పోతోంది.బండి సంజయ్ ( Bandi Sanjay ) అధ్యక్షుడిగా గద్దెనెక్కిన తర్వాత కాస్త పార్టీ ముందుకు వెళ్లిన ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వల్ల డ్యామేజ్ అయిందని చెప్పవచ్చు.
ఇది గుర్తించిన అధిష్టానం ఆయనను అధ్యక్ష పదవి నుంచి తీసేసి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చింది.ఈ తరుణంలో బిజెపిలో ఉండేటువంటి కొంతమంది నాయకులు వల్లే బిజెపి పార్టీ బలహీన పడుతుందని చెప్పవచ్చు.
మొన్నటికి మొన్నా ఎమ్మెల్యే రఘునందన్ రావు ( Raghunandan rao ) పార్టీలో ఉండేటువంటి కొంతమంది గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.ఇది మరవక ముందే మరోసారి ఎంపీ సోయం బాపూరావు బిజెపిని నాయకులను తలలు పట్టుకునేలా చేస్తున్నారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఎంపీ బాపూరావు ( Bapu rao ) మాట్లాడిన మాటలు, రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.దీంతో లంబాడి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.దీంతో బీజేపీ నాయకులు అంతా సోయం బాపూరావు వ్యాఖ్యలు తప్పుబట్టారు.పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan reddy ) మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర బడ్జెట్ రూ:900 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోకుండా విస్మరిస్తోందని అన్నారు.ఈ విధంగా అవినీతి కుటుంబ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.

ప్రజలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ( Brs ) పార్టీ విఫలమైందన్నారు.అంతేకాకుండా సోయం బాపూరావు వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.బిజెపి అధికారంలోకి రాగానే లంబాడీలకు పెద్దపీట వేస్తుందని తెలియజేశారు.
తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగిందని, రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే చరమగీతం పాడుతామని తెలియజేశారు.బాపూరావును సస్పెండ్ చేయాలి: అయితే బాపూరావు వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి నాయకులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బిజెపి నేత రవీంద్రనాథ్ ( Ravindranath ) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ తరుణంలో ఎంపీ సోయం బాపూరావుపై కిషన్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.







