బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బీఆర్ఎస్ పాలన అంతం అయ్యే వరకు బీజేపీ నిద్రపోదని చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇస్తుందని తెలిపారు.ప్రజల పేరుతో అప్పులు తెచ్చి కుటుంబం జేబులు నింపుకున్నారని ఆరోపించారు.
ప్రశ్నిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్న డీకే అరుణ అభివృద్ధి పేరుతో కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు.అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.







