తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.2018వ సంవత్సరంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా విచారణ చేసింది న్యాయస్థానం.ఈ క్రమంలోనే అఫిడవిట్ లతో పాటు ఆధారాలు కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.







