చెరుకులో ఈ అంతర పంటలతో రెట్టింపు ఆదాయం..!

చెరుకు పంట( Sugarcane crop ) దీర్ఘకాలిక పంట.చెరుకు పంట చేతికి రావడానికి పది నుంచి 12 నెలల సమయం పడుతుంది.

 Double The Income With This Intercropping In Sugarcane , Sugarcane Crop, Sugarca-TeluguStop.com

ఈ మధ్యకాలంలో చెరుకులో వివిధ రకాల అంతర పంటలను సాగు చేసి మంచి రెట్టింపు ఆదాయం పొందవచ్చు.అయితే చెరుకు పంటలో ఏ సమయంలో ఏ అంతర పంటలు వేయాలి అనే అవగాహన ఉంటేనే ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

లేదంటే అనవసరంగా నష్టాలను ఎదుర్కోవాల్సిందే.మనం ఇప్పుడు చెరుకు పంటలో ఏ సమయంలో ఏ అంతర పంటలు వేయాలో పూర్తిగా తెలుసుకుందాం.

Telugu Agriculture, Coriander, Fenugreek, Latest Telugu, Lettuce, Nitrogen, Pesa

ఫిబ్రవరి- మార్చి నెలలో చెరకు నాటు కోవడంతో పాటు పాలకూర, మెంతకూర, కొత్తిమీర, పెసర, ఉల్లి, మినుములు సాగు చేయవచ్చు.చెరకు పంటతో పాటు పెసర పంటను సాగు చెయ్యాలనుకుంటే 1:1 నిష్పత్తిలో నాటుకోవాలి.ఉల్లి సాగు( Cultivation of onion ) చేయాలి అనుకుంటే 1:1 నిష్పత్తిలో నాటుకోవాలి.అదే కొత్తిమీర సాగు( Cultivation of coriander ) చేయాలనుకుంటే 1:3 నిష్పత్తిలో నాటుకోవాలి.ఒకవేళ మినుములు సాగు చేయాలి అనుకున్న కూడా 1:1 నిష్పత్తి లో నాటుకొని సాగు చేయాలి.

Telugu Agriculture, Coriander, Fenugreek, Latest Telugu, Lettuce, Nitrogen, Pesa

చెరుకు పంటతో పాటు అంతర పంటను సాగు చేయడం వల్ల భూమి యొక్క సారం పెరుగుతుంది.ఎరువుల ఖర్చు తగ్గుతుంది.అంతర పంటలకు అందించే ఎరువులు చెరుకు పంటకు కూడా ప్రయోజనం కలిగిస్తాయి.

అంతర పంటల కోసం ప్రత్యేకంగా నీటిపారుదల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.మినుములు సాగు చేయడం వల్ల నేలలో నత్రజని( Nitrogen ) శాతం పెరుగుతుంది.

ముందుగా అంతర పంటగా వేసే విత్తనాలను విత్తన శుద్ధి చేయాలి.ఒక కిలో విత్తనాలకు ఒక గ్రాము కార్బండజిమ్, 2గ్రా.

క్యాప్టాన్ ద్రావణాన్ని తయారుచేసి అందులో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి.అంతర పంట వేసిన పది రోజుల తర్వాత నీటి తడి ను అందించాలి.

అంతర పంట విత్తనాలు మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లు, వరుసల మధ్య దూరం 30cm ఉండేటట్లు నాటుకోవాలి.ఎరువుల విషయానికి వస్తే ఒక హెక్టార్లో 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం,40 కిలోల పొటాష్ ఎరువులను విత్తే సమయంలో పొలంలో వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube