తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.ఈ నేపథ్యంలో మరి కాసేపటిలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
సాయంత్రం 6 గంటలకు ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి.ప్రొడ్యూసర్ సెక్టార్ లో మొత్తం 1,567 ఓట్లు ఉండగా 891 ఓట్లు పోలయ్యాయి.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో మొత్తం 597 ఓట్లు ఉండగా 380 పోలయ్యాయి.ఇక స్టూడియో సెక్టార్ లో మొత్తం ఓట్లు 98 కాగా 68 పోలయ్యాయని తెలుస్తోంది.
కాగా దిల్ రాజు మరియు సి.కల్యాణ్ ప్యానల్ మధ్య పోటీ నెలకొంది.







